ఆ 257 మందికి అర్హత లేదు

13 Oct, 2017 20:47 IST|Sakshi

హైదరాబాద్ : పోలీస్‌ శాఖలోని ఎస్‌ఐ ఫలితాల్లో అర్హత సాధించని అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఓపెన్‌ చాలెంజ్‌ అవకాశం కల్పించింది. గత నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 257 మంది ఓపెన్‌ చాలెంజ్‌ ద్వారా అభ్యంతరాలను వ్యక్తంచేయగా, వాటిని స్వీకరించిన బోర్డు అందులో ఏ ఒక్కరి అభ్యంతరం కూడా పరిగణలోకి తీసుకునేలా లేదని తేల్చిచెప్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 

అభ్యంతరాలు వ్యక్తంచేసిన అభ్యర్థులు, వాళ్లు లేవనెత్తిన అంశాలపై శనివారం 2గంటల తర్వాత జాబితాను రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని బోర్డు చైర్మన్‌ పూర్ణచందర్‌రావు ప్రకటనలో స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు