కలకలం రేపిన ‘ముజ్రా’

10 Dec, 2014 00:04 IST|Sakshi
కలకలం రేపిన ‘ముజ్రా’

చిలుకూరు సమీపంలోని ఓ ఇంటిపై పోలీసుల దాడి
22 మంది యువకులు, 8 మంది యువతులు అరెస్టు

 
మొయినాబాద్: అటవీ ప్రాంతం, జన సంచారం తక్కువగా ఉండటం, అనేక ఫాంహౌస్‌లు అందుబాటులో ఉండటం నగర శివారులో ముజ్రా, రేవ్ పార్టీల ఏర్పాటుకు అనుకూలంగా మారాయి. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం చిలుకూరులో ఉన్న ఓ వెంచర్‌లో సోమవారం రాత్రి జరిగిన ముజ్రా పార్టీ స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన వస్త్ర వ్యాపారి ఆకాష్ వివాహం నగరంలోని ఎల్‌బీ నగర్‌లో జరిగింది. ఆ వివాహ వేడుకకు హైదరాబాద్, ముంబై, కలకత్త ప్రాంతాలకు చెందిన కొందరు స్నేహితులు హాజరయ్యారు.

వివాహానికి విచ్చేసిన స్నేహితులకు  ఆకాష్ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని అతను జతిన్‌కు చెప్పాడు. అయితే జతిన్ పార్టీ విషయాన్ని అతని స్నేహితుడైన గౌరవ్‌కు తెలిపాడు. గౌరవ్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్ అనే వ్యక్తి పరిచయమున్నాడు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఇలాంటి పార్టీలను ఏర్పాటు చేస్తుంటాడు. వివాహానికి వచ్చిన స్నేహితులకు  పార్టీ ఏర్పాటు చేయాలని దిలీప్‌జైన్‌కు గౌరవ్ చెప్పడంతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేస్తానన్నాడు.

 మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్ హోమ్ వెంచర్‌లో ఆశీష్ జైన్ అనే వ్యక్తికి ఓ ఇళ్లు ఉంది. ఆశీష్ జైన్‌కు పార్టీలు ఏర్పాటు చేసే దిలీప్ జైన్‌కు పాత పరిచయం ఉండటంతో వెంచర్‌లోని ఇల్లును దిలీప్‌జైన్ అద్దెకు తీసుకున్నాడు. సోమవారం రాత్రి వెంచర్‌లోని ఇంట్లో ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ముంబై, అహ్మదాబాద్, కలకత్త, హైదరాబాద్‌కు చెందిన దిలీప్‌జైన్‌తోపాటు జినేష్ రాంనిక్, అంకిత్, జిగ్నేష్,  భావేష్ పటేల్, రాసిక్ ప్రజాపతి, దీపేష్, గనత్రా జతిన్, గౌరవ్, శాంతిలాల్, జయేష్, దివ్యేష్, దివాంగ, శైలేష్, హర్షత్, ఆకాష్, అసత్, నగరానికి చెందిన డ్రైవర్లు షేక్ జిలాని, షేక్ ఆసిఫ్, ఎండీ షకిల్ హైమద్, నగరంలోని అల్వాల్‌కు చెందిన వర్కర్లు ఉమర్ రాజిరెడి,్డ మురళీ కృష్ణ, 8 మంది యువతులు పార్టీలో పాల్గొన్నారు.

అర్ధరాత్రి సమయంలో డీజే పాటల హోరులో యువతులు నృత్యాలు చేస్తుంటే యువకులు వారిపై డబ్బులు వెదలజ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. (ముజ్రా పార్టీలో యువతులు నృత్యాలు చేస్తూ తమ ఒంటిపై ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని విప్పేస్తూ నృత్యం చేస్తుంటారు. చివరకు నగ్నంగా తయారై నృత్యం చేస్తారు) వెంచర్‌లోని ఓ ఇంట్లో పార్టీ నడుస్తున్నట్లు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి 12 సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. మొత్తం 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతీ యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, కండోమ్స్ పాకెట్లు...
ముజ్రా పార్టీ నిర్వహించిన ఇంట్లో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు లభించాయి. ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో యువతీ యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎస్‌ఓటీ పోలీసులు పకడ్బందీగా దాడి చేయడంతో వారంతా ఆ ఇల్లు దాటి బయటకు పోలేకపోయారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం వారందర్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ.1.21 లక్షల నగదు, 25 సెల్‌ఫోన్లు, 5 కార్లను సీజ్ చేశారు. మంగళవారం యువతీ యువకులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ రవిచంద్ర ఉన్నారు.

పార్టీల ఏర్పాటులో దిలీప్‌జైన్ పాత్ర కీలకం...
నగర శివారులో రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు ఏర్పాటు చేయడంలో దిలీప్‌జైన్ సూత్రధారిగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన దిలీప్‌జైన్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ నగర శివారుల్లోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడు. గతంలోనూ అతను జవహర్‌నగర్, శామీర్‌పేట్, చేవెళ్ల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు