మట్టికుండ.. ఆరోగ్యానికి అండ 

16 Mar, 2019 11:32 IST|Sakshi
మట్టి వాటర్‌ బాటిల్‌ను చూపుతున్న వ్యాపారి

సాక్షి, మెదక్‌ రూరల్‌: వేసవిలో చల్లటి నీరు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అందుకు ధనవంతులు రిఫ్రిజిరేటర్‌లో నీటి తాగితే మధ్య తరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలోకూడా కుండలను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి కుండలను తయారు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లు ఎంత సాంకేతికంగా అందుబాటులో ఉన్నా కుండలకు సాటిరావని కొనుగోలు దారుల అభిప్రాయం. మట్టితో తయారు చేసిన రంజన్లు, కుండలకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గటం లేదు. జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రధాన రహదారుల వెంట మట్టి కుండలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

వేసవి ఆరంభం కావడంతో ప్రజలు చల్లటి నీటిని తాగేందుకు కుండలను, రంజన్‌లను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలు తయారుచేసిన రిఫ్రిజిరేటర్‌లో చల్లటి నీటిని తాగితే ఆనారోగ్య సమస్యలున్నవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుండటంతో ఆనీటిని తాగేందుకు ఇష్టపడటంలేదు. ఇక మట్టి కుండలో నీరు అన్ని విధాలుగా మంచిదని వైద్యులే చెబుతుండటంతో వీటి  ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. ఆదిలాబాద్, కలకత్తా, గుజరాత్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రా నుంచి కుండలు, రంజన్‌లను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ఒక్కో కుండ, «రంజన్‌ ధర రూ.250 నుండి రూ.800 వరకు పలుకుతు

మట్టి వాటర్‌ బాటిల్స్‌ వచ్చాయి


– మంజుల, వ్యాపారి, మెదక్‌ 
మట్టితో తయారు చేసిన కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరిగాయి. వివిద రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మట్టితో తయారు చేసిన వాటర్‌ బాటిల్స్‌ సైతం మార్కెట్‌లోకి వచ్చాయి. సైజును బట్టి ధర ఉంటుంది.    

మరిన్ని వార్తలు