-
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
ఎండల నుంచి ఉపశమనానికి కుండనీరు శ్రేష్టమంటున్న జనాలు
-
మట్టి కుండలకు కాలం చెల్లిందా ? ఆవేదనలో కుమ్మరులు
-
చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్..
చింతూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ.50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు. చదవండి👉: అర్ధ శతాబ్దపు జ్ఞాపకం ప్రత్యేక మట్టితో తయారీ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు. తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- కొత్తపల్లి గీతకు డిపాజిట్ దక్కేనా?
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
Advertisement