28న ‘చికెన్‌ అండ్‌ ఎగ్‌ మేళా’ 

28 Feb, 2020 02:52 IST|Sakshi

కోవిడ్‌కు చికెన్‌కు సంబంధంలేదు

వదంతులు నమ్మవద్దంటున్న పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు  

సాక్షి, పంజగుట్ట: చికెన్‌ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలకు వివరించేందుకు ఈ నెల 28న సాయంత్రం 4 గంటల నుంచి నెక్లస్‌ రోడ్డులో ‘చికెన్‌ అండ్‌ ఎగ్‌ మేళా’నిర్వహిస్తున్నట్లు వివిధ పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కోవిడ్‌ వైరస్‌కు చికెన్‌కు ఎలాంటి సంబంధంలేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డిలు హాజరై చికెన్‌ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఎర్రమంజిల్‌లోని హోటల్‌ ఎన్‌కెఎం గ్రాండ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వివిధ కోళ్ల పరిశ్రమ సంఘాల ప్రతినిధులు రాంరెడ్డి, రమేశ్‌బాబు, కె.జి ఆనంద్‌లు మాట్లాడుతూ..కోవిడ్‌ వైరస్‌ వచ్చిన మొదటి 2 నుంచి 3 వారాలు చికెన్‌ అమ్మకాలు తగ్గాయని, ప్రస్తుతం ప్రజల్లో అవగాహన వచ్చి కొద్దిమేర పుంజుకుందన్నారు. 

మరిన్ని వార్తలు