విందు భోజనానికి నోచుకోని ఖైదీలు

27 Jun, 2017 01:35 IST|Sakshi

హైదరాబాద్‌: రంజాన్‌ను పురస్కరించుకొని ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఆశపడ్డ చంచల్‌గూడ ఖైదీలకు నిరాశే మిగిలింది. సాధారణ భోజనంతో పాటు ఒక లడ్డూ మాత్రమే జైలు అధికారులు వడ్డించడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. చంచల్‌ గూడ పురుషుల జైల్లో దాదాపు 350 మంది ముస్లిం ఖైదీలు నెల పాటు రంజాన్‌ ఉపవాస దీక్షలు పాటించారు.

ప్రార్థనలకు ప్రత్యేకంగా జైల్లో ఓ బ్యారెక్‌ కూడా అధికారులు కేటా యించారు. అయితే రంజాన్‌ రోజు ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారని ఊహించిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. ఖైదీల సంక్షేమం, సంస్కరణలు కోసం కృషి చేస్తున్నామని ప్రచారం చేసుకునే ఉన్నతాధికారులకు పం డుగపూట ఖైదీలకు విందు భోజనం వడ్డిం చాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టక రమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు