రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు

30 Aug, 2016 02:47 IST|Sakshi
రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు

కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తాం: ఆర్. కృష్ణయ్య

 సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబాటుకు గురైన వర్గాలే రిజర్వేషన్లకు అర్హులని తెలుగుదేశం ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఈ విషయాన్ని జాతీయ కమిషన్లు కూడా స్పష్టం చేశాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ అర్థరహితమని, వారిని చేరిస్తే స్వాతంత్య్రానికి పూర్వం నుంచి వెనుకబాటుకు గురైన కులాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ఈ ఆందోళనలకు భారీఎత్తున బీసీలు తరలివస్తున్నట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు