చంపాలని డిమాండ్‌ చేయడం సమయం వృధా

1 Dec, 2019 13:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటనపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. ఈ దారుణానికి పాల్పడ్డవారు పిచ్చికుక్కలతో సమానమని, అలాంటి వారిని చంపాలని డిమాండ్‌ చేయడం సమయం వృధా చేయటమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ఆ సమయాన్ని మహిళలకు ఎలా రక్షణ కల్పించాలనే అంశంపై కేటాయిస్తే మంచిదన్నారు. 

రేపిస్ట్‌లను ప్రశ్నించడం టీవిల్లో ప్రసారం చేయాలి
అత్యాచారానికి పాల్పడిన వారిని చంపేయాలి, తగలబెట్టాలి అనే సాధ్యం కాని డిమాండ్లను చేసే బదులు, వారిని ప్రశ్నించడాన్ని టీవిల్లో ప్రసారం చేయాలి. సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నించడం ద్వారా వాళ్లలో అలాంటి రాక్షస నేర ప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు.. ఎందుకు ఆలోచించారు..? అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది.

వాళ్లు పిచ్చికుక్కలతో సమానం
`వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారి మానసిక స్థితి పిచ్చికుక్కల కన్నా హీనంగా ఉంది. అలాంటి పిచ్చికుక్కలను హింసించి చంపాలని డిమాండ్‌ చేయటం కూడా వృథా. వాళ్లకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. దానికి బదులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి. 


పిచ్చి కుక్కలు ఏం నేర్చుకుంటాయి
ఏ రేపిస్ట్‌ కూడా గత అనుభవాల నుంచి ఏం నేర్చుకోరు. 2012లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు మనం ఇదే నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్లకు గతం నుంచి భయం నేర్చుకునేంత మెంటల్‌ కెపాసిటీ ఉండదు. ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్కపై జరిగిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది. నా ఉద్దేశం వెటర్నరీ డాక్టర్‌ హత్య చేసిన దుర్మార్గలను పిచ్చి కుక్కలు అని వదిలి పెట్టాలని కాదు. రేపిస్ట్‌లను సమాజానికి చేసిన జబ్బులా భావించి ఆ రోగాన్ని ఎలా తగ్గించాలన్న విషయంలో శాస్త్రీయంగా పరిశోదన జరపాలి. అప్పుడే మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలం. ఒక పామును ముక్కలుగా నరికితే మరో పాము మన దగ్గరికి రాకుండా ఉండదు. ఎందుకంటే వాటికి అంత ఆలోచనా శక్తి ఉండదు’  అని రామ్‌ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. 

చదవండి : 

చర్లపల్లి జైలుకు ఉన్మాదులు

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు

మరిన్ని వార్తలు