తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

6 Nov, 2017 03:17 IST|Sakshi

     ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో రూ.1,841 కోట్ల రాబడి

     గతేడాదితో పోలిస్తే రూ.100 కోట్లు తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలకుగాను రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా తగ్గింది. గత (2016– 17) ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.1,941.86 కోట్లు ఆదాయంరాగా.. ఈసారి సుమారు రూ.100 కోట్లు తక్కువగా రూ.1,841.58 కోట్లు సమకూరింది. ఇందులో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 4 రిజిస్ట్రేషన్‌ జిల్లాల నుంచే రూ.1,383 కోట్లు రావడం గమనార్హం. మిగతా అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల బాగా తగ్గిపోయినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మహబూబ్‌నగర్‌లో ఏకంగా 35% తగ్గుదల నమోదైంది. మొత్తంగా మే, ఆగస్టుల్లో ఆదాయం బాగా తక్కువగా సమకూరింది. జూలై, సెప్టెంబర్‌ ల్లో ఎక్కువగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సంఖ్య  బాగా తగ్గిపోయింది. గతేడాది తొలి 6 నెలల్లో 5,69,572 రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరగ్గా.. ఈసారి 5,07,697 లావాదేవీలే జరిగాయి.  హైదరాబాద్‌లో లావాదేవీలు ఏకంగా మూ డొంతులు తగ్గిపోయినా.. ఆదాయం మాత్రం గతేడాది స్థాయిలో సమకూరడం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు