‘మిషన్’లో మాయ

25 Apr, 2015 04:35 IST|Sakshi

‘ఉపాధి’ చెరువులకు మిషన్ కింద నిధులు
కాంట్రాక్టర్లు-అధికారుల కుమ్మక్కు
గతేడాది చెరువులకే మళ్లీ టెండర్లు

 
వరంగల్ : మిషన్ కాకతీయ పనుల మర్మం అర్థం కావడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం పథకం పెట్టారో తెలియకుండా ఉంది. చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆయకట్టు లేని చెరువులకు నిధులు కేటారుుంచడం, అనుకూలమైన వారికి టెండర్లు దక్కకపోతే మళ్లీ టెండర్లు నిర్వహించడం, గతంలో నాబార్డ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ట్రిబుల్‌ఆర్, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన చెరువులను మళ్లీ మిషన్ కాకతీయ కింద ఎంపిక చేయడం చూస్తే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విషయం అర్థం అవుతోంది.

అప్పడు చేసిన పనులకు మళ్లీ బిల్లులు చేసేందుకు పక్కా ప్రణాళికలు అధికారులు, కాంట్రాక్టర్లు కలసి రూపొందించుకున్నారు. ముందుగా అధికారులతో అవగాహనకు వచ్చి కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి గతంలో చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ బిల్లులు పొందేందుకు అధికార నేతలు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా, ఏజెన్సీలోని చెరువుల్లో పూడికతీతలు మొక్కుబడిగా ప్రతిపాదించారు.

మైదాన ప్రాంతాల్లో మంజూరైన నిధుల్లో సగానికి పైగా పూడికతీతలకు కేటాయించగా ఏజెన్సీలోని చెరువులకు కేటాయించిన నిధుల్లో 20 శాతం మించిన దాఖలాలు లేవు. కేవలం గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అవే పనులను మిషన్ కాకతీయలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా జరుగుతుందో అధికారులు చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం. ఏ చెరువులు చేపట్టారో గోప్యంగా ఉంచుతున్నారు.
 
ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామ సమీపంలోని పైడి చెరువును గతేడాది ఉపాధి హామీ పథకంలో రూ.3.75 లక్షలతో అభివృద్ధి చేశారు. మళ్లీ ఇదే చెరువును మిషన్ కాకతీయలో చేర్చి రూ.57 లక్షలు కేటాయించారు. ఈ చెరువుకు ఇటీవల రూ.46.32 లక్షలతో టెండర్లు పిలిచి ఖరారు చేశారు.
 
ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి పెద్ద చెరువుకు గతేడాది  ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ పథకంలో రూ9.70 లక్ష లు కేటాయించారు. మత్తడి మరమ్మతులకు నిధులు కేటాయించగా రింగ్‌బండ్ పేరిట నిధు లు స్వాహా చేశారు. మళ్లీ మిషన్‌లో రూ.2.75కోట్లు ప్రతిపాదించగా అనుమతి ల భించింది. కేవలం అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్ర ణాళికబద్ధంగా ఈ చెరువులకు మళ్లీ ని ధులు కేటాయించే విధంగా ప్రయత్నా లు చేసి సాధించుకున్నట్లు తెలిసింది.
 
ఏటూరునాగారం మండలం అల్లంవారి ఘనపూర్ గ్రామ సమీపంలోని బోయే చెరువు ను ఏపీసీబీటీఎంపీ పథకంలో రూ.47 లక్షలు కే టాయించారు. ఈ పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అయినా అధికార పార్టీ నేతల సిఫారసుల మేరకు ఈ చెరువుకు మిషన్‌లో నిధులు ప్రతిపాదించారు.
 
ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ, తహసీల్దార్ కార్యాలయా ల ఎదుటు ఉన్న రాళ్లకుం ట చెరువు అక్రమణలకు గురయ్యింది. దీనికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గతేడాది రూ.7.50లక్షలు మంజూ రయ్యాయి. తట్టెడు మట్టి తీయకుండానే నిధులు డ్రా చేసుకున్నారు. మళ్లీ మిషన్ కాకతీయలో సిల్ట్ తీసేం దుకు రూ.9 లక్షలు కేటాయిస్తూ ప్రతిపాదించారు. దీనికి ఆయక ట్టు లేకున్నా నిధులు ఎందుకు కేటాయిస్తున్నారోఅధికారులకే తెలియాలి.

మరిన్ని వార్తలు