మురిగిపోయిన నిధులు | Sakshi
Sakshi News home page

మురిగిపోయిన నిధులు

Published Sat, Apr 25 2015 4:14 AM

Unhappy with the panchayat members

తాలూకా పంచాయతీ సభ్యుల అసంతృప్తి
సమావేశంలో అధికారుల నిలదీత  


కోలారు : తాలూకా పంచాయతీలో సుమారు రూ. 23 లక్షల నిధులు మురిగిపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంపై శుక్రవారం నిర్వహిం చిన తాలూకా పంచాయతీ సమావేశంలో అధికారులను సభ్యులు నిలదీశారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిధులు వెనక్కు మళ్లాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే ఉపాధ్యక్షురా లు ముద్దుమణి మాట్లాడుతూ.. నిధులు వెనక్కు మళ్లడంతో తాలూకా పంచాయతీ ఎఈ నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని మండిపడ్డారు.

ఉపాధ్యక్షురాలి ఆరోపణలను ఎఈ లింగరాజు ఖండించారు. నిధుల వినియోగంలో తాను ఎలాంటి పొరబాటు చేయలేదని పేర్కొన్నారు. ఆ సమయంలో సభలో కొద్ది సేపు గందరగోళం నెల కొంది. ఉపాధ్యక్షురాలితో పాటు పలువురు సభ్యులు ఏఈ పనితీరుపై విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు మంజునాథ్ గౌడ మాట్లాడుతూ తాలూకా పంచాయతీ చరిత్రలోనే తొలిసారిగా నిధులు వెనక్కు వెళ్లాయని అన్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement