నాపై కక్ష సాధిస్తున్నారు: సంపత్‌ కుమార్‌

17 Dec, 2019 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్యలు, ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ ప్రశ్నించారు. ఓ వైపు దేశం ఆగమవుతుంటే బీజేపీ నేత అమిత్ షా అయోధ్య గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ యాదాద్రిలో పాపాలను కడిగేసుకోవడానికే దేవుడి దగ్గరకు పోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఐకియా సంస్థకు ఇచ్చిన అనుమతుల్లో క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆరోపించారు. హెరిటేజ్‌ భవనాన్ని తొలగించి కేటీఆర్‌ అక్కడ వందల కోట్లు సంపాదించారని ఆరోపణలు గుప్పించారు.

ఇక టీఆర్‌ఎస్‌ నేతలు హరీష్‌ రావు, కేటీఆర్‌లను వారితో ఉన్న స్నేహ సంబంధాల కారణంగానే చింటూ పింటూ అని పిలిచానని సంపత్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎలాంటి బూతులు మాట్లాడకుండా కేవలం ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే విమర్శించానన్నారు. కానీ వాళ్లు దీనికి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెలిపారు. ‘నాకు గన్‌మెన్లను తీసేశారు. మా అన్నను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా తొలగించారు. నా తమ్ముడికి న్యాయపరంగా వచ్చిన మున్సిపాలిటీ కాంట్రాక్ట్‌లను తొలగించారు. నాతోపాటు మాజీ ఎమ్మెల్యేలందరికీ ఏడాదికి పైగా రావాల్సిన పెన్షన్లను ఆపేశారు. తనపై కక్ష సాధింపు ధోరణితో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.  నాపై కక్ష సాధిస్తే నేను ప్రశ్నించకుండా ఉంటాననుకుంటే అది మూర్ఖత్వం. ఎన్ని చేసినా నీపై పోరాటాలు ఆపే ప్రసక్తి లేదు. ఖబడ్దార్, నీపొగరు దిగే వరకు మా పోరాటాలు ఉంటాయి’ అని  సంపత్‌ కుమార్‌ తెలిపారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు

వెల్‌కమ్‌ సర్‌

బంపర్‌ ఆఫర్లతో స్వాగతం.. బండి కొనండి

యూ ట్యూబ్‌ చూసి.. నేరాలకు దిగి

పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!

40 సేఫ్టీ

రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్‌ చేస్తా

ప్రవిజ.. ఇక్కడే సూసైడ్‌ చేసుకుందాం: సురేష్‌

కలెక్టర్‌ సర్ఫరాజ్‌పై వేటు

సేవలోనే అందం ఆనందం..

సమత నిందితుల తరఫున వాదించేందుకు నిరాకరణ

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

కక్షతోనే సురేష్, ప్రవిజ దంపతుల ఆరోపణలు..

నేడు యాదాద్రికి సీఎం రాక

నేటి ముఖ్యాంశాలు..

బాలికపై యువకుడి అత్యాచారం

చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట

ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు!

మద్యం ధరలకు కిక్కు!

రాష్ట్రపతి శీతాకాల విడిదికి యాక్షన్‌ప్లాన్‌

19న ర్యాలీ: లెఫ్ట్‌ పార్టీలు

త్వరలో మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్లు: తలసాని

మున్సి‘పోల్స్‌’కు సిద్ధమే: జగ్గారెడ్డి

రాష్ట్రంలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి

తెలంగాణ దేశానికే ఆదర్శం

రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

డైరెక్టర్‌ బచ్చన్‌

తెలుగు రాష్ట్రంలో తలైవి