సెక్యూరిటీ గార్డులే డాక్టర్లు!

10 Jun, 2019 02:04 IST|Sakshi

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో రోగుల ఇక్కట్లు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్య సేవలను సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు అందిస్తున్నారు. సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించింది. రెండేళ్ల క్రితం ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిట్‌లు ప్రవేశపెట్టడంతో ఇక్కడ రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్దాసుపత్రి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే రోగులకు సెలైన్లు అమర్చుతూ, ఇంజెక్షన్లు వేస్తున్న దృశ్యాలు ఆదివారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇక్కడ కాన్పు అయిన తర్వాత ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగ పిల్లాడు పుడితే మరో రేటు చొప్పున ఆసుపత్రి సిబ్బంది వసూళ్లు కూడా చేస్తుండడం గమనార్హం. ఈ విషయం తెలిసినా వైద్య అధికారులు ఏమీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు