ఎస్సై కమ్యూనికేషన్, పీటీవో ఫలితాలు

29 Jul, 2017 02:10 IST|Sakshi
ఎస్సై కమ్యూనికేషన్, పీటీవో ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలోని కమ్యూనికేషన్‌ ఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (పీటీవో) ఎస్సై పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ఫలితాలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్‌ పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విభాగాల్లో కలిపి 29 పోస్టులకు పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. గతేడాది నవంబర్‌ 19, 20, 27 తేదీల్లో నిర్వహించిన ఎస్సై కమ్యూనికేషన్‌కు తుది పరీక్షకు 519 మంది, 77మంది ఎస్సై పీటీవో పోస్టుకు హాజరైనట్లు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల మార్కులను  www.tslprb.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు.

కమ్యూనికేషన్‌ విభాగంలో 23 పోస్టుల్లో ఆరుగురు మహిళలున్నారని తెలిపారు. సమాన మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో ఎవరు ముందు పుట్టారో వారిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. తుది పరీక్ష రాసిన అభ్యర్థులకు సందేహాలుంటే ఆగస్టు 5 నుంచి 9 వరకు ఓపెన్‌ చాలెంజ్‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

ఎంపికైన అభ్యర్థులు...
కమ్యూనికేషన్‌ విభాగం: ఓపెన్‌ కేటగిరీలో 2005208, 2014948, 2011129, 2005350, 2002664, 2006634, 2001788, 2001807, 2000781, 2016376, 2009415, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ విభాగంలో 2012470, బీసీ–ఏలో 2002771, 2008375, బీసీ–బీలో 2002461, బీసీ–సీలో 2016391, బీసీ–డీలో 2017132, బీసీ–ఈలో 2010800, ఎస్సీ కేటగిరీలో 2011091, 2011778, 2006544, 2009495, ఎస్టీ విభాగంలో 2018828 రిజిస్ట్రేషన్‌ నంబర్లున్న అభ్యర్థులు ఎంపికయినట్టు పేర్కొన్నారు.

పీటీవో విభాగం: ఓపెన్‌ కేటగిరీలో 2019585, 2006268, 2017668, 2017794, బీసీ–ఏలో 2012312, ఎస్సీ విభాగంలో 2007938 ఎంపికయ్యారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా