అక్కే చంపింది..

2 Jul, 2017 09:11 IST|Sakshi


18 నెలలకు వీడిన మిస్సింగ్‌ కేసు మిస్టరీ
►  ప్రియుడితో కలిసి తోడపుట్టిన తమ్ముడి హత్య
ప్రియుడికి సింగరేణి ఉద్యోగం  కోసం అఘాయిత్యం
►  వివరాలు వెల్లడించిన డీసీపీ


ధర్మారం(ధర్మపురి):
మానవత్వం మంట కలుస్తోంది. రక్తబంధం మాయమవుతోంది. ప్రియుడికోసం సొంత తమ్ముడినే హత్యచేసిందో సోదరి... వివరాల్లో కెళితే.. 18 నెలల క్రితం ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మి స్సింగ్‌కేసు మిస్టరీ వీడింది.ప్రియుడితో కలిసి సొంత అక్క నే తమ్ముడిని హత్య చేసింది. ఖమ్మం జిల్లా చండ్రుపాడు మండలం రవికంపాడు గ్రామాని చెందిన కావేటి వెంకటేశం(26) మిస్సింగ్‌ కేసును ఎస్సై బాబురావు వి విధ కోణాలలో విచారణ జరిపి ఛేదించారు. ధర్మారం మండలం చామనపల్లి శివారులోని వాగులో పూడ్చిన పెట్టిన వెంకటేశం శవాన్ని పెద్దపల్లి డీసీ పీ విజేందర్‌రెడ్డి, ఏసీపీ సింధూశర్మ, సీఐ మహేష్, ఎస్సై బాబురావు ఆధ్వర్యంలో శనివారం వెలికితీశారు. అనంతరం డీసీపీ విజేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా రవికంపాడుకు చెంది న కావేటి రాములు సింగరేణి కార్మికుడిగా ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ స్ధిరపడ్డాడు. రాములుకు ఇద్దరు కు మారులు నాగేశ్వర్‌రావు, వెంకటేశం, కూతురు నాగమణి(30) ఉన్నారు. పెద్దకుమారుడు సొంత గ్రామంలో ఉండగా, వెంకటేశం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ భార్య ప్రియాంకతో కలిసి పెద్దపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నాడు. నాగమణిని ధర్మారం మండలం కటికెనపల్లి గ్రా మానికి చెందిన కట్ట పోచయ్యతో వివాహం జరిపిం చారు. కొద్దిరోజులు కాపురం చేసి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన వేల్పు ల మల్లేశం(35)తో వివాహేతర సంబంధం పెటుకుని అతడితోనే కలిసి ఉంటుంది.

 
ఉద్యోగం కోసమే హత్య
నాగమణి తండ్రి రాములు తన ఉద్యోగ విరమణ అనం తరం పెద్దకొడుకుకు వ్యవసాయ భూమి, చిన్న కొడుకుకు సింగరేణి ఉద్యోగం ఇస్తానని తీర్మానం చేశాడు. తండ్రి ఉద్యోగం తమ్ముడైన వెంకటేశంకు కాకుండా తన ప్రియుడైన మల్లేశంకు వచ్చేందుకు నాగమణి పథకం పన్నింది. మల్లేశంను వివాహమాడి, వెంకటేశంను హతమారిస్తే ఉద్యోగం అతడికే వస్తుందని ఆలోచన చేసింది.

ఇంటికి పిలిచి.. గొంతు నులిమి
వెంకటేశంను హతమార్చేందుకు పథకం పన్నిన నాగమ ణి గతేడాది జనవరి 15న వెంకటేశంను కటికెనపల్లి లోని తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. వెంకటేశ్‌ వ చ్చాక ముగ్గురు కలిసి విందు చేసుకున్నారు. ఆతరువాత మల్లేశం, నాగమణి కలిసి వెంకటేశ్‌ను గొంతునులిమి హత్య చేశారు. అదే రాత్రి శవా న్ని మండలంలోని పత్తి పాకకు చెందిన చిక్కాల రాయమల్లు(40) కారులో చామనపల్లి వాగులోకి తరలించారు. అక్కడే గోయ్యి తీసి పూడ్చి పెట్టారు.

భార్యఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు
వారం గడిచినా వెంకటేశం ఇంటికి రాకపోవటంతో భార్య ప్రియాంక ఆడబిడ్డ నాగమణికి చెప్పింది. నాగమణి సూచన మేరకు ధర్మారం పోలీస్‌స్టేషన్‌లోఫిర్యాదు చేసిం ది. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు  నమోదైంది. ఇటీవల ధర్మారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాబురావు మిస్సింగ్‌ కేసుపై దృష్టి సాచించారు. అన్ని కోణాల్లో విచారించి వెంకటేశం హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిందితులను పట్టుకుని విచారిస్తే నిజాలు వెల్లడించారు. నాగమణి, వేల్పుల మల్లేశంలతో పాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్‌ చిక్కాల రాయమల్లు,అరెస్టు చేసి, హత్యకు పరోక్షంగా సహకరించిన వెంకటేశం సోదరుడు నాగేశ్వర్‌రావులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజేందర్‌రెడ్డి తెలిపారు.

నిందితులు రాయమల్లు, మల్లేశం, నాగమణి