లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష

11 Jun, 2015 22:43 IST|Sakshi

రంగారెడ్డి(తాండూరు): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయవాది రంగారావు గురువారం తీర్పు వెల్లడించారు. తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం..2013 సంవత్సరంలో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన దొరళ్ల చించేడి మాణెయ్య(55) సైకిల్‌పై వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ ఆయనను ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు లారీ డ్రైవర్ వీరప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం తాండూరు మున్సిఫ్‌కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు. జైలు శిక్షను తగ్గించాలని కోరుతూ లారీ డ్రైవర్ వీరప్ప వికారాబాద్‌లోని జిల్లా అదనపు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గురువారం పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి కిందికోర్టుతీర్పును సమర్థిస్తూ అదే శిక్షను విధించారు.

>
మరిన్ని వార్తలు