హైకోర్టులో స్పెషల్ జీపీలు, జీపీల నియామకం

16 Jul, 2014 03:20 IST|Sakshi

 ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
 నలుగురు స్పెషల్ జీపీలు, ఐదుగురు జీపీలు
 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో తమ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (స్పెషల్ జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు స్పెషల్ జీపీలను, ఐదుగురు జీపీలను నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

స్పెషల్ జీపీలుగా బి.మహేందర్‌రెడ్డి, ఎస్.శరత్‌కుమార్, ఎ.సంజీవ్‌కుమార్, బి.ఎస్.ప్రసాద్ నియమితులు కాగా, జీపీలుగా పి.పంకజ్‌రెడ్డి, ఆర్.రాజేష్ మెహతా, ఎ.నజీబ్‌ఖాన్, జి.అరుణ్‌కుమార్, సి.వెంకట్ యాదవ్‌లను నియమించారు. మూడేళ్లపాటు వీరంతా ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. స్పెషల్ జీపీలు ఒక్కొక్కరికి నెలకు రూ.75 వేలు, జీపీలు ఒక్కొక్కరికి రూ.55 వేలు గౌరవ వేతనం అందుతుంది. మరో 10-12 జీపీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 30 వరకు ఏజీపీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు