'జిల్లాలో కేసులు తక్కువగానే ఉన్నాయి'

3 Apr, 2020 21:23 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినా అధికారులు ముందే పసిగట్టడంతో జిల్లాలో కేసులు తక్కువగానే నమోదయ్యాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి, ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి, వారి ద్వారా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 350 మంది ఉన్నారు. వీరిలో 327 మందిని ఇప్పటికే క్వారంటైన్‌ చేశాం. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. కరోనా లక్షణాలను ఉన్న వారిని గుర్తించి వారిని హోమ్,ఆసుపత్రి, క్వారంటైన్‌లలో ఉంచామన్నారు.ఇప్పటికి కరోనా సోకిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్యనే ఉంది...కానీ ఎవ్వరికి ఉందొ చెప్పలేము..పాలమూరు పట్టణంలో ప్రమాద హెచ్చరికలు మొగుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప దయచేసి ఎవరు బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'ఢిల్లీ నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారు సిబ్బందికి సహకరించాలని వేడుకుంటున్నా. మీరు ఇంట్లో ఉండి.. సహకరిస్తే దేశాన్ని కాపాడిన వారు అవుతారంటూ' తెలిపారు. వైద్యులు, ఫైర్, మున్సిపల్ సిబ్బంది వారి విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారు. వైద్యుడు దేవుడితో సమానం.. వారిని తిట్టడం, దాడి చేయడం మంచి పద్దతి కాదని శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు