లక్షమందికి లడ్డూల పంపిణీ: కేసీఆర్

5 Jun, 2015 19:12 IST|Sakshi
లక్షమందికి లడ్డూల పంపిణీ: కేసీఆర్

హైదరాబాద్: జూన్ 7 రాత్రి ట్యాంక్బండ్ పై తెలంగాణ రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహంచాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.  లక్ష మందికి లడ్డూలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి నిజా కాలేజీ గ్రౌండ్స్ నుంచి ట్యాంక్బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జంటనగరాల ప్రజలు పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హుస్సేన్సాగర్ ప్రాంతంలో లేజర్ షోలు, త్రీడీ లైటింగ్, బాణాసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు.

మరిన్ని వార్తలు