మాస్కులు కుడుతున్న ‘బ్రిటిష్‌ ఇల్లాలు’

8 Apr, 2020 04:11 IST|Sakshi

బంజారాహిల్స్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉండగా కొంతమంది పేదలు వీటికి దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–3లో నివసించే బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ హైదరాబాద్‌ విభాగం అధికారి ఆండ్రుఫ్లెమింగ్‌ భార్య వ్యాన్‌ఫ్లెమింగ్‌ గత 3 రోజుల నుంచి మాస్క్‌లు ఉచితంగా అందిస్తున్నారు. నైజీరియన్‌ క్లాత్‌తో ఆమె ఈ మాస్క్‌లు కుడుతూ తన చుట్టుపక్కల నివసించే పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ సేవకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆమె 300కుపైగా మాస్క్‌లను సొంతంగా కుట్టి పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు