మా అవసరం 157 టీఎంసీలు

29 Dec, 2019 03:01 IST|Sakshi

కృష్ణా బోర్డుకు లేఖ రాసిన రాష్ట్రం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో వచ్చే వర్షాకాల సీజన్‌ ముందు వరకు తమకు 157 టీఎంసీల అవసరాలుంటాయని రాష్ట్రం తేల్చింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే చివరి వరకు తమ అవసరాలను పేర్కొంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇందులో శ్రీశైలంప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు 22 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ కింద హైదరాబాద్‌ తాగునీరు, ఏఎంఆర్‌పీ, మిషన్‌ భగీరథ అవసరాలకు కలిపి 45 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద అవసరాలకు 90 టీఎంసీలు కలిపి మొత్తంగా 135 టీఎంసీలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇక ఈ వాటర్‌ ఇయర్‌లో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు 645.36 టీఎంసీల మేర వినియోగించుకోగా తెలంగాణ వాటా 219 టీఎంసీలుగా ఉందని, అయితే అందులో రాష్ట్రం 148 టీఎంసీలు మాత్రమే వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 250 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, అందులో తెలంగాణకు 160 టీ ఎంసీల మేర వాటా ఉంటుందని దృష్టికి తెచ్చింది.  

మరిన్ని వార్తలు