తెయూలో కొత్త కోర్సులకు ఆమోదం

4 May, 2014 02:20 IST|Sakshi

తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్ అండ్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో వర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ నేతృత్వంలో శనివారం ఐదో అకడమిక్ సెనేట్ సమావేశం నిర్వహించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సెనేట్ సమావేశం సుమారు మూడు గంటల పాటు హాట్ హాట్‌గా కొనసాగింది. ఎజెండా అంశాలను రిజిస్ట్రార్ సెనేట్ సభ్యులకు వివరించి చర ్చకు ఆహ్వానించారు. ఎజెండాలోని 27 అంశాలపై సెనేట్ సభ్యులు తమ సూచనలను అందించారు.

 కెమిస్ట్రీలో కొత్తగా మూడు కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించగా, అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ యాదగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు.యూనివర్సిటీ లో ఇప్పటికే సైన్స్ కోర్సులు చాలానే ఉన్నాయని, పలుమార్లు కోరినా సోషల్ సెన్సైస్ కోర్సుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సైన్స్ కోర్సులతో పాటు ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కోర్సులకు సమాన ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన కోరారు. ఎల్‌ఎల్‌ఎల్ కోర్సులో రెండు నూతన అంశాలు చేర్చాలని, బీఎడ్, ఎంఈడీ కోర్సులు ప్రారంభించాలని, ఎంఏఎం కోర్సును ఐదేళ్ల ఎంబీ ఏ కోర్సుగా మార్చాలన్న ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

భిక్కనూరు సౌత్‌క్యాంపస్‌లో ఎంఏ తెలుగు, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు సంబంధించి అదనపు విభాగాలు ప్రారంభించాలని, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్సీ మాథ్స్, ఎంఫార్మసీ మొదలైన కొత్త కోర్సుల ప్రారంభించాలన్న అంశాలపై సెనెట్ సభ్యులు చర్చించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ న్యూస్ బులెటిన్ ప్రారంభించాని తీర్మానించారు. పరిశోధన, బోధన, విద్యార్థుల వసతి, పరీక్షలు ఇతర అంశాలలో అభివృద్ధికి అవసరమైన సూచనలను సెనేట్ సభ్యులు చర్చించారు.

 సెనేట్ సమావేశంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌ఎల్‌ఎం విభాగంలో రెండు స్పెషలైజేషన్ కోర్సులు ప్రారంభించాలని సూచించారు. కార్పొరేట్ లా(ఎల్‌ఎల్‌ఎం), కాన్సిస్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ లా(ఎల్‌ఎల్‌ఎం) కోర్సులను భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ప్రారంభించాలని సెనేట్ ఆమోదించింది. దీంతో పాటు బీటెక్ విభాగంలో సీఎస్‌సీ, ఐటీ కోర్సులను ప్రారంభించాలని, అలాగే వర్సి టీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల్లో కామర్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆమోదించారు. వర్సిటీ పరిధిలోని ఎల్లారెడ్డి, బిచ్కుంద, కామారెడ్డి, ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు ఏటా కాకుండా, శాశ్వత అనుబంధ గుర్తింపు ఇవ్వాలని సెనేట్ సభ్యు లు తీర్మానించారు. సమావేశంలో సెనేట్ సభ్యులు, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు