భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి: సీపీఐ

12 Jan, 2015 01:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, 125 గజాలు, ఆ పైన ఆక్రమించుకుని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, గతంలో భూపోరాటాల సందర్భంగా పెట్టిన కేసులన్నింటిని ఎత్తేయాలని తీర్మానం ఆమోదించింది.

ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం పలు తీర్మానాలు చేసింది. క్రమబద్ధీకరణ పేరుతో భూకబ్జాదారులు లాభపడకుండా చూడాలని, అక్రమ లేఅవుట్లు చేసి అమ్మినవారిని కఠినంగా శిక్షించాలని కోరింది. రాష్ట్రంలోని 338 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, వ్యవసాయకూలీలు, పేదలకు కరువు భృతిని అందించాలని విజ్ఞప్తి చేసింది. మార్చి 7-10 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభ ల డాక్యుమెంట్‌లోని అంశాలపై చర్చించి ఈ సమావేశం  ఆమోదించింది.

మరిన్ని వార్తలు