పార్టీ పూర్వ వైభవానికి కృషి

21 May, 2016 04:47 IST|Sakshi
పార్టీ పూర్వ వైభవానికి కృషి

దొరల పాలనకు బుద్ధి చెప్పాలి
మినీ మహానాడులో పార్టీ నేతలు
రాథోడ్‌కు రాజ్యసభ సీటు  ఇవ్వాలని తీర్మానం


ఉట్నూర్‌రూరల్ : రాబోయే 2019 ఎన్నికల నాటికి మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయూలని టీడీపీ శ్రేణులు నిర్ణరుుంచారుు. శుక్రవారం స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన పార్టీ  మినీ మహానాడుకు రాష్ట్ర నేతలతోపాటు జిల్లా నేతలు హాజరయ్యారు. అంతకు ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మినీ మహానాడులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగం మల్లేశ్, పొలిట్ బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మాట్లాడారు. బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉపాధి లేక ఎంతో మంది బాంబే, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 2019 నాటికి తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందన్నారు.

 కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మిషన్‌కాకతీయ

 మిషన్ కాకతీయ ద్వారా పంట చేన్లకు చుక్క నీరు అందడం లేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఈ పథకం పెట్టారని నాయకులు విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఉట్నూర్‌లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ మాట మార్చి వరంగల్‌కు తరలించడం సమంజసం కాదన్నారు. మంత్రులకు యూనివర్సిటీపై మాట్లాడే ధమ్ము ధైర్యం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

టీడీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని, కొమురంభీం స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. రమేశ్ రాథోడ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని మినీ మహానాడులో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌కు చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యూరు. జిల్లా అధ్యక్షులు లొలం శ్యాంసుందర్,  జిల్లా ఉపాధ్యక్షులు పి.నరహరి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్,  తెలుగుయువత అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, తెలుగుయువత రాష్ట్ర నాయకులు రితేశ్ రాథోడ్,  మైనార్టీ విభాగం సభ్యులు యూనూస్ అక్బాని, ప్రేమ్, ధన్‌లాల్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు