కేబుల్ వ్యవస్థను పరిశ్రమగా గుర్తించాలి

20 Feb, 2015 02:29 IST|Sakshi

హైదరాబాద్: కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను పరిశ్రమగా గుర్తించి ప్రోత్సాహం అందించాలని తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బౌండరీ నిర్ణయించి లెసైన్సులు, ఐడెంటీ కార్డులు ఇవ్వాలని, అవసరమైన వారికి రుణాలు మంజూరు చేయాలని, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సర్వీస్ టాక్స్‌ను రద్దు చేయాలని, ఎంఎస్‌ఓలకు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, గ్రేటర్ అధ్యక్షుడు సతీష్, నాయకులు సుధాకర్, మధు, అబ్దుల్ మాలిక్, మోహన్, వెంకట రమణ, రమేష్, రాజీ శ్రీవాస్తవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు