జోనల్‌ వ్యవస్థ ఉంటేనే లాభం

14 Jan, 2017 03:54 IST|Sakshi
జోనల్‌ వ్యవస్థ ఉంటేనే లాభం
  • జేఏసీ చైర్మన్‌ కోదండరాం
  • స్థానిక రిజర్వేషన్లతోనే సమాన అవకాశాలు
  • సాక్షి, వరంగల్‌: తెలంగాణలో జోనల్‌ వ్యవస్థ ఉంటేనే అవకాశాలపరంగా సమానత ఉంటుందని జేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం అన్నారు. సమాన అవకాశాలు దక్కేలా స్థానిక రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు. జోనల్‌ వ్యవస్థపై తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో వరంగల్‌లో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. కార్య క్రమం లో జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడారు. ‘1973 ముందు ఉన్న ముల్కి నిబంధనలను రద్దు చేసి 371(డి) ఆర్డినెన్స్‌తో స్థానికులకు ఉద్యోగాలు దక్కా లనే ఆలోచనతో రాష్ట్రపతికి అధికారం ఇచ్చారు. దీంతో ఎక్కడి ప్రాంతాల వారికి అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.

    స్థానికత అంశం కోసం జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చాయి. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ ప్రకారం ఆయా పోస్టులు జిల్లా  ,  జోన్, రాష్ట్ర స్థాయిలోకి వచ్చాయి. రాçష్ట్ర స్థాయి పోస్టులకు స్థానిక రిజర్వేషన్‌ లేదు. అన్ని పోస్టుల కూ.. స్థానిక రిజర్వేషన్‌లు లేకపోతే సమస్యలు వస్తాయి. జోన్‌ వ్యవస్థ ఉంటే తప్ప సమస్యకు పరిష్కారం లేదు. స్థానికతతో కొత్త అవకాశాలు పెరుగుతాయి. సమాన అవకాశాలు దక్కాలంటే ఏదో రూపంలో స్థానిక రిజర్వేషన్‌లు అవసరం. రాష్ట్రంరాక ముందు ఆం్ర«ధాప్రాంతం వారు 371 (డి) స్థానికత అంశం తేలకుండా రాష్ట్రం ఇవ్వద్దని కొర్రీలు పెట్టారు. అప్పుడు ఈ అంశంపై ఐక్యంగా ఉండి సమస్యను పరిష్కరించుకున్నాం. జిల్లాల అవసరాల కోసం... స్థానిక రిజర్వేషన్లు చూడ కుండా ఖాళీలు, నిష్పత్తి చూడకుండా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం.

    రంగారెడ్డి జిల్లాల్లో స్థానికేతరులే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. జోనల్‌ వ్యసస్థ రద్దు అంశం రాష్ట్రపతి పరిధిలోనిది. జిల్లాల పునర్విభజన పరిపాలన అవసరాల కోసం జరిగింది. తొందరపడి ఏక పక్షంగా జోనల్‌ వ్యవస్థను రద్దు చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రమాదకరంగా ఉంటుంది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జోనల్‌ వ్యవస్థను తిరిగి పునరు ద్ధరిం చేలా ఉద్యమిద్దాం’అని పిలుపునిచ్చారు.  ఈ సమావేశానికి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అధ్యక్షతన వహించారు.

    జరిగిన అభివృద్ధి రియల్టర్ల కోసమే..
    సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణ ఆవిర్భవించి న తర్వాత జరిగిన అభివృద్ధి అంతా రియల్టర్లు, వ్యాపారుల కోసమే తప్ప.. సాధారణ ప్రజలకు మేలు జరగలేదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. సీపీఎం మహాజన పాదయాత్ర శుక్రవారం ఇక్కడికి చేరుకున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యా యం జరుగుతుందని అనుకున్నామని, కానీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, తెలం గాణ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్, లంబాడ హక్కుల పోరాట సమితి నేత బెల్లయ్యనాయక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు