జల్సాల కోసం చోరీలు

25 Mar, 2016 00:25 IST|Sakshi
జల్సాల కోసం చోరీలు

దొంగ అరెస్టు.. భారీగా రికవరీ
20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో  64 కేసుల నమోదు


మహబూబ్‌నగర్:  కొన్నిరోజు లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గజదొంగ ఎట్టకేలకు దొరికాడు.  ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెస్ట్‌జోన్ ఐజీ నవీన్‌చంద్, ఎస్పీ విశ్వప్రసాద్‌లు గురువారం  విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మల్దకల్ మండలం పాల్వాయికి చెందిన వడ్డె గోపాల్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిం చాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు. 2009లో పశువులను దొంగతనం చేసి జైలుకెళ్లివచ్చాడు. జైలు నుంచి విడుదల య్యాక మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.


ఈ క్రమంలో గ్రామాల్లో ఉదయం పూట తిరిగి ఇళ్లకు తాళాలు వేసినవాటిని గుర్తిం చేవాడు. రాత్రివేళ ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. జిల్లాలో దాదాపు 20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏడాదిన్నరలో 64 దొంగతనాలు చేశాడు. గద్వాలలో పెట్రోలింగ్ పోలీసులకు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.10.63 లక్షలు, 1.2 కేజీల బంగారం, ఏడు కిలోల వెండి, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

 

మరిన్ని వార్తలు