ఈ చిన్నారిని ఆదుకోరూ..

11 Jul, 2017 12:35 IST|Sakshi

గార్ల: తమ చిన్నారి కాలేయ వ్యాధితో బాధపడుతోందని, లివర్ ప్లాంటేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారని,  ఆర్థిక సాయం చేసి తమ చిన్నారిని అదుకోవాలని మూడున్నరేళ్ల సౌజన్య తల్లిదండ్రులు అర్థిస్తున్నారు. మహబూబాబాద్ గార్ల మండలం రామాపురానికి చెందిన మేడేపల్లి సతీష్, మమత దంపతుల కుమార్తే సౌజన్య కాలేయ వ్యాధితో బాధపడుతోంది. అనేక ఆస్పత్రులలో చూపించి చాలా వరకు ఖర్చు పెట్టారు. అయినా వ్యాధి నయం కాలేదు.

క్షౌర వృత్తితో రెక్కాడితే కానీ డొక్కాడని  పరిస్థితిలో సతీష్ చాలా చోట్ల అప్పులు చేశాడు. అయినా  వ్యాధి నయంకాక మరింత ముదిరింది. ఈ క్రమంలో హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చూపించగా రెండు నెలల వ్యవధితో లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలని సుమారు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నరవుతున్నారు. ఆర్థిక సాయం కోసం ఇటీవల మంత్రి కేటీఆర్ ను కలవగా హామీ ఇచ్చారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని చిన్నారి తల్లిదండ్రలు వాపోయారు. దాతలు సాయం చేసి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని వారు వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు