ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి

20 May, 2016 01:37 IST|Sakshi
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి

కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భగవంతురెడ్డి

 
 
కొడంగల్ : జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులు 90 శాతం పూర్తయ్యాయని, వాటికి వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొడంగల్ లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ తెలంగాణ కు వ్యతిరేకం కాదని, ఇక్కడి రైతులకు మేలు జరగే విధంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చే యాలని కోరుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ప ట్టించుకోకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ  ప్రభుత్వం కూ డా అదే బాటలో నడుస్తోందని, వాటిని పూర్తిచేయిస్తే వైఎస్ పేరే వస్తుందని భావించి కొత్త ప్రాజె క్టులను చేపడుతోం దని విమర్శించారు.

ప్రస్తుతం రైతులు ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారని, వా రికి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటా వైఎస్‌ఆర్ అభిమానులు ఉన్నారని, ఆయన చేపట్టిన పథకాలు ప్రజల గుం డెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు.  రైతులకు ఉచిత కరెం టు, రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలన్నీ వైఎస్‌ఆర్ అమలు చేసినవేనని గుర్తుచేశారు.

తెలంగాణ లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు తీసిపోని విధంగా వైఎస్‌ఆర్‌సీపీ కూడా బలంగా నిలబడుతుందన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు సం ఘం తెలంగాణ అధ్యక్షుడు గందె హన్మంతు, జిల్లా నాయకుడు తమ్మళి బాల్‌రాజ్, నాయకులు అశోక్, బుగ్గయ్య, కుమార్, ఖాజామైనొద్దీన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు