రుణమాఫీ మిగతా రైతులకు చేయరా?

18 Mar, 2017 02:58 IST|Sakshi
రుణమాఫీ మిగతా రైతులకు చేయరా?

కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ రైతుల రుణమాఫీకి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి మిగిలిన రాష్ట్రా లను విస్మరించడం దారుణమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, బిగాల గణేశ్‌గుప్తా, చింతా ప్రభాకర్‌లు కేంద్రంపై ధ్వజమెత్తారు. శుక్రవారం  వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతుల పరిస్థితే మిటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలను ఒకే రకండా చూడాలని, దేశా భివృద్ధి రైతులపైనే ఆధారపడి ఉందని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దేశంలో ఎక్కడా రైతులు ఆనందగా లేరని, రైతులందరికీ ఒకే రకమైన జాతీయ విధానం ఉండాలని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రైతుల రుణమాఫీకి అవసరమైన రూ. 50వేల కోట్లను కేంద్ర భరించాలని నిర్ణయించడం చూస్తే.. మిగిలిన రాష్ట్రాల రైతులను వంచించడమేనని ఆయన ఆరోపించారు.

దోపిడీకి గురైన తెలంగా ణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వ లేదన్నారు. కేంద్రం వెంటనే స్పందించి రూ. 17వేల కోట్లను ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీ వెళ్లి తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రుణమాఫీ నిధులను సమకూర్చాలని కోరాల న్నారు. కేంద్రానిది సవతి తల్లి ప్రేమని గణేశ్‌గుప్తా ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే ప్రయోజనం చేసేలా కేంద్రం వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.

మరిన్ని వార్తలు