ఇబ్బందులుంటే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి

13 Mar, 2020 12:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘2014 ఏపీ విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఉంది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే స్పష్టమైన ప్రకటన ఇవ్వాల’ని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కనీసం పీపీపీ పద్దతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందన్నారు. రెండు రాజధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చెయ్యొచ్చని చెప్పారు. 

హైదరాబాద్ టు విజయవాడ బుల్లెట్ ట్రైన్ నడిపిస్తే ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్నారు. జగ్గయ్యపేట-మట్టపల్లి-జాన్పహాడ్-మిర్యాలగూడ రైల్వే ట్రాక్‌లో గూడ్స్ రైలు మాత్రమే నడుస్తోందన్నారు. ఆ ట్రాక్‌లో ప్యాసింజర్ రైలును కుడా నడపాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కూడా అత్యంత వేగవంత ట్రాక్ నిర్మాణ ప్రాజెక్టుల్లో చేర్చాలని కోరానన్నారు.

మరిన్ని వార్తలు