కార్డు స్కాన్‌ చేస్తేనే బండి స్టార్ట్‌

19 Jun, 2019 03:18 IST|Sakshi
ఆర్‌సీ కార్డును స్కాన్‌ చేస్తున్న మల్లేశం

‘కీ’ఉన్నా.. ఆర్‌సీ కార్డు, లైసెన్స్‌ కార్డుకు లింకు 

సిరిసిల్ల యువకుడి సృష్టి 

సిరిసిల్ల: ఓ ఐడియా బైక్‌లకు భద్రతను తెచ్చిపెట్టింది. వాహనానికి తాళం వేసి ఉంటే చాలు.. ఏదో ఒక కీతో ఆన్‌చేసి చోరీ చేసే రోజులివి. బైక్‌లు, స్కూటీలు, కార్లు సైతం దొంగల బారిన పడకుండా ఉండాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆర్‌సీకార్డు, లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ల్లో ఏదో ఒక కార్డుతో స్కాన్‌ చేస్తేనే వాహనం స్టార్ట్‌ అయ్యేలా డివైస్‌ను రూపొందించాడు. జిల్లా కేంద్రంలోని పద్మనగర్‌కు చెందిన బుధవారపు మల్లేశం తన బైక్‌ ఆక్టివాకు ఆర్‌సీ కార్డు నంబరును స్కాన్‌ చేశాడు. రేడియో ఫీక్వెన్సీ స్కానర్, మైక్రో కంట్రోల్‌ ఐసీని ద్విచక్రవాహనానికి అమర్చాడు.

వాహనం బ్యాటరీ సాయంతో అది పని చేస్తోంది. బండికి కీస్‌పెట్టి, ఆర్‌సీ కార్డు, లేదా లైసెన్స్‌ కార్డును ఏదో ఒకదానిని స్కాన్‌ చేస్తేనే బండి ఆన్‌ అవుతుంది. కార్డు స్కాన్‌ కాకుండా.. కీస్‌ ఉన్నా బండి ఇంజిన్‌ ఆన్‌ కాదు. ఈ తరహా రేడియో ప్రీక్వెన్సీ డివైస్‌ను బైక్, కారు, లారీ, బస్సు లాంటి ఇతర వాహనాలకు ఏర్పాటు చేసుకోవచ్చు. బీటెక్‌ ఈసీఈ చదివిన మల్లేశం కేవలం రూ.1,500 ఖర్చుతో డివైస్‌ను రూపొందించాడు. ఎవరైనా వాహనదారులు కావాలనుకుంటే లాభాపేక్ష లేకుండా బైక్‌లు, కార్లకు దీనిని అమర్చుతానని మల్లేశం తెలిపాడు. ఆసక్తి గలవారు 63024 72700 సెల్‌ నంబరులో సంప్రదించండి.

మరిన్ని వార్తలు