మాకెందుకీ శాపం..!

15 Jun, 2016 23:57 IST|Sakshi

 అనారోగ్యంతో మంచానపడిన భార్యాభర్తలు
ఒకరికి లివర్ కేన్సర్.. మరొకరికి హార్ట్ సర్జరీ
మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న దంపతులు
{పైవేట్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద కూతురు
మానవతావాదులు ఆదుకోవాలని వేడుకోలు

 

పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన మేకల నర్సయ్య, నిర్మల దంపతులకు ఇద్దరు కూతు ళ్లు అరుణ, అపర్ణ, కుమారుడు చందు ఉన్నారు. అరుుతే నర్సయ్య స్థానిక చక్కర్ బీడీ ఖార్కానాలో కొన్నేళ్ల నుంచి ప్యాకింగ్ పనులు చేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నారు. కాగా, నర్సయ్య కొన్ని నెలల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నొప్పి ఎక్కువగా రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లి హార్ట్ సర్జరీ చేరుుంచారు. అరుుతే గుండెకు ఆపరేషన్ జరగడంతో నర్సయ్య రోజువారీ పనులకు వెళ్లకుండా మంచానికే పరిమితమయ్యారు.

 
భార్యకు లివర్ కేన్సర్..

కొద్ది రోజుల క్రితం నర్సయ్య హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు సపర్యలు చేస్తుండడంతోపాటు భార్య నిర్మల స్థానికంగా ఉన్న కేక్‌ల ఫ్యాక్టరీలో రోజువారీ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. అరుుతే పనులకు వెళ్లిన సమయంలో నిర్మలకు ఒకసారి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నిర్మల లివర్ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో నిర్మల సొంత ఖర్చులతో హైదరాబాద్‌లోని జీఎన్‌ఎమ్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంది. అరుుతే వారానికి మూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందాలని, ప్రతి నెల రూ. 10వేలు విలువ చేసే మందులు వేసుకుంటేనే ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుందని డాక్టర్లు చెప్పడంతో భార్యాభర్తలు బోరున విలపిస్తున్నారు.

 

కూలీనాలి చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్న ఆ దంపతులపై రోగాల పిడుగు పడింది. మాయదారి జబ్బులతో వారు మంచానికే పరిమితమై బోరున విలపిస్తున్నారు. అరుుతే అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నను కాపాడుకునేందుకు వారి పిల్లలు పడరాని పాట్లు పడుతున్నారు. మానవతావాదులు స్పందించి తమ తల్లిదండ్రుల ను ఆదుకోవాలని చేతులెత్తి వేడుకుం టున్నారు. హృద్రోగం, లివర్ కేన్సర్ తో తల్లడిల్లుతున్న నిరుపేద దంపతులపై ప్రత్యేక కథనం.

 

మందులకు డబ్బులు లేక ఇబ్బందులు..
నర్సయ్య పెద్ద కూతురు అరుణ పీజీ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. అరుుతే ఆమెకు నెలకు రూ. 2,500 వేతనం వస్తుండడంతోపాటు నర్సయ్యకు వృద్ధాప్య పిం ఛన్ కింద నెలకు రూ. 1000 వస్తుంది. దీంతో వచ్చిన డబ్బులతో అరుణ ఇంటి అవసరాలను తీర్చుతుం దే కానీ.. తల్లిదండ్రులకు మందులు కొనుగోలు చేయలేకపోతుంది. కాగా, నర్సయ్య కూతుర్లు, కొడుకు రోజు ఒక పూటనే భోజనం చేస్తూ రెండు రోజులకోసారి వారికి మందులు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్య దంపతుల పరిస్థితిని చూసిన స్థానికులు సుమారు 20 మంది ఇటీవల ఇంటికి రూ.100 చొప్పున వసూలు చేసి వారికి అందజేశారు. కాగా, అరు ణ రోజు మందులు వేసుకునే పరిస్థితి లేకపోవడంతో లివర్ సైజు పెరుగుతూ కడుపు ఉబ్బుతోంది. దీం తో తల్లిదండ్రుల అనార్యోగాన్ని చూడలేక పిల్లలు నిత్యం గుండెలవిసేలా రోదిస్తున్నారు.

 

దాతలు ఆదుకోవాలి..
అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మానాన్నకు మందులు కొనుగోలు చేసి ఇచ్చేందుకు మా దగ్గర డబ్బులు లేవు. లివర్ కేన్సర్‌తో అమ్మ పొట్ట సైజు రోజురోజుకూ పెరుగుతోంది. గుండెకు ఆపరేషన్ జరగడంతో నాన్న ఏపనిచేసే పరిస్థితిలో లేడు. దాతలు సాయం అందించి అమ్మానాన్నకు మెరుగైన వైద్యం అందించాలి. సాయం చేసే మానవతావాదులు సెల్ నంబర్ 95738-25964లో సంప్రదించాలి.

 -అరుణ, అపర్ణ, చందు

మరిన్ని వార్తలు