ఏపీ సీఎంగా జగన్‌.. తెలంగాణలో సంబరాలు

30 May, 2019 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దివంగత మహానేత వైఎ‍స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్ నాయకులు, నరేష్, రమేష్, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలో వైఎస్సార్‌సీపీ సంబరాలు అంబరాన్ని అంటాయి. కేక్ కట్ చేసి బాణసంచా కాలుస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ దార్ల అశోక్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రగతి మహా విద్యాలయలో వైఎస్‌ జగన్‌ స్నేహితులు కేక్‌ కోసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రొజెక్టర్‌ ద్వారా తెరపై వీక్షించి పులకించిపోయారు. వేడుకలతో ప్రగతి మహా విద్యాలయలో పండగ వాతావరణం నెలకొంది.

చెన్నైలో అన్నదానం
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు చెన్నైలో అన్నదానం చేశారు. వెయ్యి మందికి పైగా బిర్యానీ పంచారు. వైఎస్సార్‌సీపీ నేతలు దువ్వూరి సురేష్ రెడ్డి, కడివేటి గోపాలకృష్ణా రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

మూతపడుతున్న ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..