ఇండోనేషియాలో భూకంపం

18 Mar, 2015 10:13 IST|Sakshi

జకార్తా: ఇండోనేషియాలోని మొలుక్కా సముద్రంలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.6 నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. భూకంపం వల్ల సముద్ర గర్భంలో పలకల మధ్య తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఉండవచ్చని పేర్కొంది.

2004లో పశ్చి సుమిత్ర ద్వీపంలోని అచీ ప్రావెన్స్ సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీతో దాదాపు రెండు లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు