ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. మౌనంగా ఉండలేం: సుప్రీం

5 Feb, 2016 01:09 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. మౌనంగా ఉండలేం: సుప్రీం

అరుణాచల్ కేసులో ఉద్ఘాటన
న్యూఢిల్లీ: గవర్నర్ నిర్ణయాలన్నిటినీ కోర్టు సమీక్షంచజాలదన్న వాదనపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలను వధించినప్పుడు తాము మౌన ప్రేక్షకులుగా ఉండజాలమని  రాజ్యాంగ ధర్మాసనం ఉద్ఘాటించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ అధికారాలను పరిశీలిస్తున్న కోర్టు కేసు విచారణ  సందర్భంగా కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.  

ఇదిలావుంటే.. అరుణాచల్ శాసనసభ అధికారి ఒకరు సమర్పించిన సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందని ధర్మాసనం.. శాసనసభ గత అక్టోబర్ నుంచి గురువారం వరకూ జరిపిన ఉత్తరప్రత్యురాల వివరాలతో కూడిన రికార్డులను 8వ తేదీన కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు