24వ డబ్ల్యూసీపీ సదస్సుకు బీజింగ్ వేదిక

11 Aug, 2013 09:20 IST|Sakshi

2018లో జరగనున్న 24వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పిలాసఫి (డబ్ల్యూసీపీ) సదస్సుకు చైనా రాజధాని బీజింగ్ నగరం అతిథ్యం ఇవ్వనుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పిలసాఫికల్ సొసైటీ (ఎఫ్ఐఎస్పీ) ప్రోగ్రాం కమిటీ అధ్యక్షుడు డెర్మట్ మెరన్ వెల్లడించారు. ఏథెన్స్లో జరుగుతున్న 23వ డబ్ల్యూసీపీ సదస్సు ముగింపు సమావేశంలో భాగంగా మెరన్ శనివారం తెలిపారు.

 

ఐదేళ్లకు ఓ సారి జరిగే ఆ అంతర్జాతీయ సదస్సుకు మొట్టమొదటిసారిగా చైనా అతిథ్యం ఇస్తుందని పేర్కొన్నారు. డబ్ల్యూసీపీ సదస్సుకు చైనా ఎంపిక కావడం పట్ల పీకింగ్ యూనివర్శిటీలోని పిలాసఫి విభాగం అధ్యక్షుడు వాంగ్ బో హార్షం వ్యక్తం చేశారు. చైనాలో  పిలాసఫి అభివృద్ది చేసేందుకు ఆ సదస్సు దోహదపడుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పిలాసఫర్లు మరో అత్యంత పురాతన నగరమైన బీజింగ్లో మరోసారి కలవనున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బ్రెజిల్తో పోటీపడి చైనా ఈ అవకాశం పొందినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏథెన్స్లో డబ్ల్యూసీపీ సదస్సు ఆగస్టు 4న మొదలైంది. దాదాపు వంద దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 1900 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా డబ్ల్యూసీపీ సదస్సును ప్యారిస్ వేదికగా జరిగింది. 

>
మరిన్ని వార్తలు