తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక

12 Dec, 2016 16:07 IST|Sakshi
తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక

చెన్నై:  తమిళనాడు రాష్ట్రాన్ని తుఫాను, భారీ వర్షాలు మరోసారి వణికిస్తున్నాయి.  వార్దా తుఫాను విజృంభిస్తున్న నేపథ్యంలో   కేంద్రం రంగంలోకి దిగింది. ముఖ్యంగా వార్దా తుఫాను, ఈదురుగాలులకు భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో  ప్రధాన జలాశయాల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని  కోరింది.  ముఖ్యంగా  పూండి, చంబరం పక్కం ఇతర  జలాశయాల ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరింది.

తమిళనాడు లోని చెన్నె తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో   వర్షపాతం తీవ్రత భారీగా ఉంది.  కొన్ని ప్రదేశాలలో 7-19 సెం.మీ వర్షం నమోదైంది. ఇదిక్ర మంగా పెరుగుతూ 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు  సూచిస్తున్నారు. దీంతో చెన్నై నగరం చుట్టు పక్కల ఉన్న పూండి, చంబరం పక్కం రిజర్వాయర్లు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   రిజర్వాయర్లు   పూర్తిగా నిండనప్పటికీ, ఊహించని వర్షాలతో  ప్రమాదకరంగా మారేఅవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించినట్టు కేంద్ర  జలవనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

వర్షధాటికి భారీగా చెట్లు కూలిపోతున్నాయి. దీంతో నావీ రంగంలోకి దిగింది.  సహాయక  చర్యల నిమిత్తం ఇప్పటికే  రెండు  నౌకలు   అందుబాటులో ఉంచామని, తక్షణం సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ ఛీప్  కెప్టెన్ డీకే శర్మ ప్రకటించారు.



 

మరిన్ని వార్తలు