రామ్పాల్ ఆశ్రమం వద్దకు పారామిలటరీ బలగాలు

19 Nov, 2014 19:07 IST|Sakshi
రామ్పాల్ ఆశ్రమం వద్దకు పారామిలటరీ బలగాలు

బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్పాల్ కు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించింది. హర్యానా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు బలగాలను పంపించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామ్పాల్ ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం పోలీసులు ప్రయత్నించగా హింస చెలరేగింది. సత్యలోక్ ఆశ్రమం వద్ద మళ్లీ ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించడంతో హోంశాఖ అప్రమత్తమైంది.

ఆశ్రమంలో దాదాపు 12 వేల మంది రామ్పాల్ అనుచరులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆశ్రమం ఖాళీచేసి వెళ్లాలని వీరందరినీ పోలీసులు ఆదేశించారు.  రామ్పాల్ ఇప్పటికీ ఆశ్రమంలోనే ఉన్నారని, ఆయనను అరెస్ట్ చేసే తమ వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట తెలిపారు.

మరిన్ని వార్తలు