2 కోట్ల 'వ్యభిచార' అకౌంట్లకు వీచాట్ చెక్!

11 Jun, 2014 21:24 IST|Sakshi
బీజింగ్: వ్యభిచార కార్యకాలాపాలను అరికట్టేందుకు సుమారు 2 కోట్ల అకౌంట్లను తొలగించినట్టు చైనాలోని ప్రఖ్యాత ఇన్స్ స్టాంట్ మెసేజ్ సర్వీస్ వీచాట్ సంస్థ వెల్లడించింది. ఆన్ లైన్ లో అసభ్య కార్యకలాపాలను అరికట్టేందుకు  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా 'వ్యభిచార' సంబంధిత అకౌంట్లను మూసివేసినట్టు సంస్థ తెలిపింది. 
 
అన్ లైన్ లో వస్తువుల భూటకపు అమ్మకాలు సాగిస్తున్న మరో 30 వేల అకౌంట్లపై కూడా వేటు వేసినట్టు వీచాట్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత మూడు నెలలుగా సైబర్ నేరాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. 
 
శృంగార, అసభ్యకరమైన సైబర్ నేరాలుతోపాటు, ఇంటర్నెట్ లో వైరస్ వ్యాప్తి చేసే కార్యక్రమాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. సైబర్ నేరాలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే విధంగా వీచాట్ కు చెందిన ట్రాన్సెంట్ కంపెనీ 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. 
మరిన్ని వార్తలు