చిరు సినిమాకు సెన్సెషనల్‌ రికార్డు!

31 May, 2017 12:45 IST|Sakshi
చిరు సినిమాకు సెన్సెషనల్‌ రికార్డు!

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు దశాబ్దం​ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన సినిమా ’ఖైదీ నెంబర్‌ 150’ .. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించి చిరు సినీ ఛరిష్మా తగ్గలేదని నిరూపించింది. కొన్ని నెలల కిందట విడుదలైన ఈ సినిమాకు ఇంకా క్రేజ్‌ తగ్గలేదని తాజాగా బుల్లితెరపైనా రుజువైంది.
 
గత ఆదివారం ఓ టీవీ ఛానెల్‌లో ఈ చిత్రాన్ని ప్రసారం చేసింది. ఊహించినట్టే బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్‌లో ఈ సినిమా నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇంకో ఛానెల్‌లో ఐఫా అవార్డుల వేడుకను ప్రసారం చేసినా.. ప్రేక్షకులు మాత్రం ‘ఖైదీ నెంబర్‌ 150’కే మొగ్గు చూపారు. దీంతో అభిమానుల ఉత్సాహానికి మరింత ఊపునిస్తూ.. చానెల్‌ నిర్వాహకులు ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ పాటలను రెండేసిసార్లు ప్రసారం చేయడం గమనార్హం. ఇలా రెండేసిసార్లు రిపీటెడ్‌గా ప్రసారం చేయడం బుల్లితెర చరిత్రలో ఇదే మొదటిసారట.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు