65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం

24 Dec, 2014 12:24 IST|Sakshi
65 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో కాంతి మందగించి రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. 65 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాలుగు రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీ రావాల్సిన 57 రైళ్లు ఆలస్యంగా రానున్నాయి. పొగమంచు కారణంగా 30 విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.

విజిబిలిటీ 150 మీటర్లకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం 8.30 గంటలకు తేమ 97 శాతం ఉందని వెల్లడించింది. ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 16.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

మరిన్ని వార్తలు