ఆర్ఎస్ఎస్ నుంచి భారతరత్న వరకు | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ నుంచి భారతరత్న వరకు

Published Wed, Dec 24 2014 12:20 PM

ఆర్ఎస్ఎస్ నుంచి భారతరత్న వరకు - Sakshi

న్యూఢిల్లీ: భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవీయాకు కూడా భారతరత్న పురస్కారన్ని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మాజీ ప్రధానుల జాబితాలో  అటల్ బిహారీ వాజ్పేయి 6వ నాయకుడిగా నిలిచారు.


అటల్ బీహారీ వాజ్పేయి జీవిత ప్రస్థానం:
1926, డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలోన బద్దేశ్వర్లో వాజ్పేయ్ జన్మించారు.
తల్లీదండ్రులు శ్రీకృష్ణ బిహారీ వాజిపాయ్, కృష్ణాదేవి
విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు
రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు
దేశసేవ కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
ఆర్ఎస్ఎస్ పత్రికకు సంపాదకుడిగా వ్యవహారించారు.
1951లో జన్సంఘ్ను ఏర్పాటు చేశారు.
జన్ సంఘ్ వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.
31 ఏళ్ల వయస్సులోనే లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం లో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేశారు.
1968లో జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1980లో ఎల్ కే అద్వానీ, షెకావత్లతో కలసి వాజ్పేయి బీజేపీని స్థాపించారు
1996లో తొలిసారిగా వాజ్పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
సంఖ్యాబలం లేక 13 రోజులకే ప్రధాని పదవి నుంచి దిగిపోయారు
1998లో రెండోసారి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామి అయిన అన్నాడీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పేయి ప్రధాని పీఠం నుంచి వైదొలిగారు.
1999లో ముచ్చటగా మూడోసారి వాజ్పేయి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. 2004 వరకు ఆయన  ప్రధానిగా కొనసాగారు. ఆ సమయంలోనే పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. భారత్, పాక్ల మధ్య చోటు చేసుకున్న కార్గిల్ యుద్ధం కూడా ఆయన హయాంలోనే జరిగింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే మూడు సార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అలాగే వాజ్పేయి కూడా మూడు సార్లు ప్రధాని పీఠం అధిష్టించారు.
2005లో రాజకీయాల నుంచి వాజ్ పేయి నిష్క్రమించారు

Advertisement

తప్పక చదవండి

Advertisement