దేశం విడిచి వెళ్లండి: అమెరికా

11 Jan, 2014 03:02 IST|Sakshi
దేశం విడిచి వెళ్లండి: అమెరికా

వీసా కేసులో దేవయానికి అమెరికా ఆదేశం
భారత్ ప్రతిచర్య.. అమెరికా దౌత్యవేత్త ‘బహిష్కరణ’
ఖోబ్రగడేపై నేరాభియోగాలు  నమోదు చేసిన అమెరికా కోర్టు
యూఎన్ మిషన్‌కు దేవయూని బదిలీకి ఎట్టకేలకు యూఎస్ ఆమోదం

 
 న్యూయూర్క్/న్యూఢిల్లీ:
భారత్-అమెరికా దౌత్య సంబంధాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత దౌత్యవేత్త దేవయూని ఖోబ్రగడే (39) ‘వీసా కేసు’లో.. తాజాగా చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. దేవయూనిని అమెరికా బహిష్కరించడం, ఇందుకు ప్రతిచర్యగా భారత్ సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించడం.. తదితర పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయూరుు. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిం దిగా దేవయూని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అమెరికా కోర్టు.. తాజాగా శుక్రవారం ఆమెపై ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగాలు నమోదు చేసింది. దీనికిముందు.. అరెస్టు నేపథ్యంలో భారత్ దేవయూనిని ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేయడాన్ని అమెరికా ఎట్టకేలకు ఆమోదించింది. తద్వారా ఆమెకు పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది.
 
 అరుుతే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయూల్సిందిగా కోరిన అమెరికా.. భారత్ అందుకు నిరాకరించడంతో ఖోబ్రగడేను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయూని న్యూ యూర్క్ నుంచి భారత్‌కు పయనమయ్యూరు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతి చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని పేరు తెలియని డెరైక్టర్ స్థారుు (దేవయూని హోదాతో సమానమైన హోదా) అమెరికా దౌత్యవేత్తను బహిష్కరించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
 
 ఆయన పేరు వెల్లడి కానప్పటికీ పనిమనిషి రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి అమెరికాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన దౌత్యవేత్తపైనే బహిష్కరణ వేటు పడినట్లు సమాచారం. అరుుతే ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించేందుకు భారత అధికారులు నిరాకరించారు. అమెరికా ఎంబసీలోని ఓ దౌత్యవేత్తను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కార్యాలయూన్ని కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. భారత్ ఈ విధంగా ‘దెబ్బకు దెబ్బ’ వంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. 33 ఏళ్ల క్రితం అమెరికా ప్రభాకర్ మీనన్ అనే భారత దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు.. ఇండియూ కూడా ఢిల్లీలోని అమెరికా పొలిటికల్ కాన్సులర్‌ను బహిష్కరించింది. దేవయూనిపై అమెరికా కోర్టు నేరారోపణలు నమోదు చేయడాన్ని భారత్ ఓటమిగా బీజేపీ అభివర్ణించింది. అమెరికాలో కేసు పెండింగ్‌లోనే ఉంటున్నందున ఇది మన ఓటమేనని, విజయం కాదని బీజేపీ నేత, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.
 
 అభియోగాలు అలాగే ఉంటారుు: యూఎస్ అటార్నీ
 పూర్తిస్థారుు దౌత్యరక్షణ ఉన్న నేపథ్యంలో దేవయూని భారత్ తిరిగి వెళ్తున్నప్పటికీ దేవయూనిపై మోపిన అభియోగాలు అలాగే ఉంటాయని అమెరికా కోర్టు విస్త­ృత ధర్మాసనం (గ్రాండ్ జ్యూరీ) స్పష్టం చేసింది. దౌత్య రక్షణ లేకుండా దే వయూని కనుక అమెరికా తిరిగివచ్చిన పక్షంలో విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని యూఎస్ అటార్నీ ప్రీత్ బరారా చెప్పారు. జిల్లా జడ్జి షీరా షీండ్లిన్‌కు రాసిన లేఖలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారంలో.. మోసం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి రెండు నేరాలు కోర్టు దేవయూనిపై మోపినట్టు బరారా వివరించారు. దేవయూనికి దౌత్య రక్షణ హోదా ఇటీవలే కల్పించిన విషయం తమకు తెలుసునని చెప్పారు. పనిమనిషి రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడంతో పాటు దేవయూని ఆమెకు తగిన వేతనం చెల్లించడం లేదని, ఇతర ఆరోపణలతో  మొత్తం 21 పేజీలతో ఖోబ్రగడేపై చార్జిషీట్ దాఖలైంది.
 
 తప్పుడు, ఆధారరహిత అభియోగాలు: దేవయూని
 తనపై మోపిన అభియోగాలు తప్పు, ఆధార రహితమని 1999 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అరుున ఖోబ్రగడే పేర్కొన్నారు. భారత్‌కు విమానం ఎక్కేముందు ఆమె పీటీఐతో మాట్లాడారు. ఈ పరిణామాలు తన కుటుంబంపై, ముఖ్యంగా ఇప్పటికీ అమెరికాలోనే ఉన్న తన పిల్లలపై ఎలాంటి దుష్ర్పభావాన్నీ చూపబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన భారత విదేశాంగ శాఖ మంత్రికి, సహచరులకు, రాజకీయ నాయకత్వానికి, మీడియూకు.. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశ ప్రజానీకానికి ఆమె కృతజ్ఞత లు తెలిపారు. పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించిన నేపథ్యంలో దేవయూని అమెరికా బయ ట కూడా పర్యటించవచ్చని, ఈ నేపథ్యంలోనే భారత్ వెళుతున్నారని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ చెప్పారు.
 
 మౌనం వీడిన సంగీత
 దేవయూని ఇటు ఇండియూ విమానమెక్కగానే పనిమనిషి సంగీత రిచర్డ్ మౌనం వీడారు. దౌత్యవేత్త వద్ద పనిచేస్తుండగా తానెన్నో బాధలు పడ్డట్టు చెప్పారు. తనలా బాధలకు గురికాకుండా చూసుకోండంటూ ఇతర పని మనుషులకు సూచించారు. కుటుంబం కోసం కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి తిరిగి ఇండియూ వెళ్లిపోవాలనుకున్నట్టు సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ‘సేఫ్ హారిజాన్’ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
 
 రాజీ నిరాకరించిన దేవయూని
 దేశ సార్వభౌమాధికారాన్ని సమున్నత స్థారుులో నిలిపేందుకు పోరాటం కొనసాగిస్తున్న తన కుమార్తె.. కేసులో రాజీ పడి అమెరికాలోనే ఉండాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనను నిరాకరించినట్లు దేవయూని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. పనిమనిషికి పరిహారం చెల్లించడం, జరిమానా కట్టడం, దర్యాప్తు చేసిన వ్యక్తికి కూడా చెల్లింపులు చేస్తే ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటామని, తద్వారా అమెరికాలోనే ఉండవచ్చని చెప్పారన్నారు. ఈ రాజీ ప్రతిపాదనను దేవయూని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు.
 
 పరిణామాల క్రమం..
 వీసా కేసులో డిసెంబర్ 12న దేవయూనిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దుస్తులు విప్పి మరీ ఆమెను సోదా చేశారు. నేరగాళ్లతో కలిపి లాకప్‌లో ఉంచారు. అరెస్టు నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిన్నర రూపాయల పూచీకత్తుతో ఖోబ్రగడే విడుదలయ్యూరు. దేవయూని అరెస్టు భారత్, అమెరికాల మధ్య వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేసింది. తద్వారా ఆమెకు డిప్యూటీ కాన్సులర్ హోదాలో పాక్షిక దౌత్య రక్షణ కాకుండా పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే అమెరికా ఈ విధమైన యూఎన్ గుర్తింపునకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేసింది. ఎట్టకేలకు భారత్, అమెరికా ప్రధాన కార్యాలయూల ఒప్పందాన్ని అనుసరించి ఈ నెల 8న దేవయూనికి పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. ఈ నెల 9న ఆ హోదాను రద్దు చేయూల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. తద్వారా ఖోబ్రగడేను కోర్టులో విచారించేందుకు వీలవుతుందని ఆ దేశం ఆశించింది.

>
మరిన్ని వార్తలు