‘ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు’

10 Mar, 2017 15:01 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లో వందశాతం గెలుపు తమదేనని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు రాంగోపాల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా వార్తా చానళ్లు కొద్ది రోజుల క్రితమే ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను మార్చినట్టు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పారు.

ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్‌ తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని బీజేపీ నాయకుడు శ్రీకాంత్ శర్మ ప్రశ్నించారు. అవసరమైతే బీఎస్పీతో చేతులు కలుపుతామని సీఎం అఖిలేశ్‌ యాదవ్ ప్రకటించడం వెనుక ఒత్తిడి ఉందని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా తమ కూటమే విజయం సాధిస్తుందని ఎస్పీ, కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు