బిల్లు 600.. టిప్పు 13 వేలు!

29 Apr, 2015 17:53 IST|Sakshi
బిల్లు 600.. టిప్పు 13 వేలు!

హోటల్కు వెళ్లినప్పుడు మనకు సర్వ్ చేసినవాళ్లు పద్ధతిగా, మనకు నచ్చినట్లుగా చేస్తే టిప్పు ఇవ్వడం సర్వసాధారణం. మామూలుగా సర్వ్ చేసినా ఇస్తాము గానీ... మనసుకు నచ్చినట్లు చేస్తే నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తాం. అంతేగానీ, ఏకంగా బిల్లుకు 20 రెట్లు ఎక్కువ మొత్తం టిప్పు ఎప్పుడైనా ఇచ్చారా? అమెరికాలోని ఓ రెస్టారెంటులో పనిచేసే వెయిట్రెస్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఆమె తన కొడుకును ఎంతగా మిస్ అవుతున్నానో అనే విషయాన్ని ఎవరితోనో చెబుతుండగా విన్న కస్టమర్... బిల్లు 600 అయితే, టిప్పుగా సుమారు రూ. 13 వేలు కలిపి మరీ ఇచ్చారు. బిల్లు మొత్తంతో పాటు టిప్పు కూడా ఎంతన్న విషయం అక్కడ బిల్లు మీద రాయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని కార్డులోంచి తీసుకుంటారు. ఆ బిల్లుతోపాటు, ''నీ సర్వీసు బాగుంది, థాంక్యూ. మీ అబ్బాయి గురించి చెబుతుంటే నాకు వినిపించింది. ఈ మొత్తం ఉపయోగించి అతడిని చూసి రా'' అని ఓ చిన్న కాగితం మీద రాసి మరీ ఇచ్చారు. ఈ బిల్లు, చిన్న లేఖతో కలిసిన ఈ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ రేపుతోంది.

మరిన్ని వార్తలు