బంగారం దిగుమతుల విలువ తగ్గింపు

14 Nov, 2013 02:08 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారం టారిఫ్ విలువ తగ్గింది.  10 గ్రాములకు 440 డాలర్లుగా ఉన్న ఈ విలువ 417 డాలర్లకు (5%)తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ యథాపూర్వం కేజీకి 738 డాలర్లుగా కొనసాగనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ నెలారంభంలో ఔన్స్(31.1గ్రా)కు 1322 డాలర్ల వద్ద ఉన్న పసిడి విలువ గత రాత్రి 1266 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ (సీబీఈసీ) తాజా నిర్ణయం తీసుకుంది. బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని ఈ నిర్దేశిత విలువపై విధిస్తారు. అంటే తాజా టారీఫ్ విలువ ప్రకారం దిగుమతి సుంకం 44 డాలర్ల నుంచి 41.7 డాలర్లకు (3.2 డాలర్ల వ్యత్యాసం) తగ్గుతుంది. రూపాయిల్లో ఈ తగ్గుదల దాదాపు రూ. 200 వుంటుంది. ఈ మేరకు గురువారం స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుతుంది.

>
మరిన్ని వార్తలు