ప్రతి దారీ.. జనఝరి | Sakshi
Sakshi News home page

ప్రతి దారీ.. జనఝరి

Published Thu, Nov 14 2013 2:07 AM

overwhelming public in ys jagan mohan reddy tour

సాక్షి, కాకినాడ :జనాభిమానం వరద గోదారిలా  ఉప్పొంగింది. జననేతను ముంచెత్తింది. ఏడాదిన్నర అనంతరం జిల్లాకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరు సాగిస్తున్న వీరుడిగా అఖండ స్వాగతం పలికారు.  వారి ఆప్యాయతానురాగాలతో జననేత తడిసిముద్దయ్యారు. మహానేత కుటుంబం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించిన సీనియర్ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం జగన్ జిల్లాకు వచ్చారు.  పర్యటన అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ‘జై సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర హీరో జగన్’ అంటూ నినదించారు.
 
 హైదరాబాద్ నుంచి స్పైస్‌జెట్ విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు మధురపూడి చేరుకున్న జగన్ విమానాశ్రయం నుంచి బయటకొచ్చేందుకు 25 నిముషాలు పట్టిం దంటే జనం ఏ స్థాయిలో వెల్లువెత్తారో అర్థమవుతుంది. అక్కడ నుంచి రాజమండ్రి కంబాలచెరువు సెంటర్ వరకు దారిపొడవునా జనం వేలాదిగా బారులు తీరారు.  మహిళలు హారతులిచ్చి జగన్‌ను ఆశీర్వదించారు. చిన్నారులు, యువకులు జగన్‌ను చూడగానే కేరింతలు కొడుతూ జై జగన్..జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. వృద్ధులు, వికలాంగులు సైతం జగన్‌ను చూసేందుకు తపించారు.  
 
 దివంగతనేత జక్కంపూడికి నివాళి
 కంబాలచెరువు సెంటర్ వద్ద జగన్‌కు పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, గణేష్  స్వాగతం పలికారు.  అక్కడ జగన్ దివంగత నేత జక్కంపూడి రా మ్మోహనరావు విగ్రహానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం జక్కంపూడి స్వ గృహానికి చేరుకొని ఇటీవల వివాహమైన జ క్కంపూడి తనయ సింధు సహస్ర, భుజంగరాయుడు దంపతులను ఆశీర్వదించారు.  నగర కాపు సంఘం కాపులను బీసీల్లో చేర్చాలంటూ జగన్‌కు వినతిపత్రం సమర్పించింది. అక్కడ నుంచి రాజానగరం చేరుకున్న జగన్‌కు కాకినా డ సిటీ  మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సిటీ కన్వీనర్ ఫ్రూటీకుమార్, పసుపులేటి చంద్రశేఖర్, వెంకటలక్ష్మి, మల్లిపాముల గణపతి తదితరులు 200కు పైగా కార్లతో ఎదురేగి స్వాగతం పలికారు. 
 
 రంగంపేట చేరుకున్న జగన్‌కు థర్మల్ ప్లాంట్ ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ పార్టీ నాయకుడు పడాల రామారెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రంగంపేటలో పార్టీ నాయకులు బొడ్డు వెంకటరమణచౌదరి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెద్దాపురం, సామర్లకోటలలో కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, టౌన్ కన్వీనర్ గుణ్ణం రాజబ్బాయి, అచ్చంపేట జంక్షన్‌లో రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో కర్రి సత్యనారాయణ తదితరులు ఘనస్వాగతం పలికారు. 
 
 సూర్యప్రకాష్, 
 దివ్యశ్రీ దంపతులకు ఆశీస్సులు
 రాత్రి 10.10 గంటలకు కాకినాడ ఆశ్రం పబ్లిక్ స్కూల్ రోడ్డులోని ద్వారంపూడి భాస్కరరెడ్డి, పద్మావతి కళ్యాణమండపానికి చేరుకున్న జగన్‌కు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీ దంపతులను ఆశీర్వదించారు. ‘ప్రయాణంలో ఆలస్యమైంది. ప్రజల అభిమానం వల్ల ముహూర్త సమయానికి రాలేక పోయాను’ అంటూ బోస్‌కు జగన్ వివరించారు. అనంతరం జగన్ కాకినాడ తాజీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఇంటికి చేరుకొని   బస చేశారు. జగన్ పర్యటనలో జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు గుర్నాధరెడ్డి, గొల్ల బాబూరావు, కేంద్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఇందుకూరి 
 
 రామకృష్ణంరాజు, మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, సీజీసీ సభ్యులు గంపల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, పాతపాటి సర్రాజు, మాజీ ఎంపీలు ఏజేవీబీ మహేశ్వరరావు, గిరజాల వెంకటస్వామినాయుడు,  నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, మందపాటి కిరణ్‌కుమార్, బొంతు రాజేశ్వరరావు, మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, చింతలపాటి వెంకటరామరాజు, చింతా కృష్ణమూర్తి, గుత్తుల సాయి, రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు మార్గన గంగాధర్, నయీం భాయి, రొంగలి లక్ష్మి, గెడ్డం రమణ, గారపాటి ఆనంద్, రావూరి వెంకటేశ్వరరావు, మంతెన రవిరాజు, గుత్తుల రమణ, అడపా వెంకటరమణ, మట్టపర్తి మురళీకృష్ణ, పార్టీ రాష్ట్ర కమిటీల సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్, వాసిరెడ్డి జమీల్, జక్కంపూడి తాతాజీ, ఎన్.వసుంధర, వరదా రవికి రణ్, గుర్రం గౌతమ్, నగర లీగల్ సెల్ కన్వీనర్ ఉమామహేశ్వరి,  ఆర్‌వివి సత్యనారాయణ చౌదరి, భూపతిరాజు సుదర్శనబాబు, జ్యోతుల నవీన్ కుమార్, పెన్మత్స చిట్టిరాజు, చెల్లుబోయిన శ్రీను, అక్కిరెడ్డి మహేష్, రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 
 
 12 కిలోమీటర్లు.. 4.30 గంటల ప్రయాణం
 మధురపూడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని కంబాలచెరువు సెంటర్‌కు చేరేందుకు నాలుగున్నర గంటలకు పైగా సమయం పట్టింది. తనపై వెల్లువెత్తిన అభిమానానికి ఉద్వేగం చెందిన జగన్ ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులను, వృద్ధులను  దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దాడగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. జగన్ మధురపూడి నుంచి గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్‌ల మీదుగా కంబాల చెరువు సెంటర్ చేరుకున్నారు. యువనాయకుడు జక్కంపూడి గణేష్ వందలాది యువకులతో మోటారు సైకిల్ ర్యాలీతో ఎదురేగి జగన్‌కు స్వాగతం పలికారు. 
 
 గాడాల సెంటర్‌లో జగన్ యువనాయకుడు జక్కంపూడి రాజాతో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయించి, నివాళులర్పించారు. గాడాల శివార్లలో  బొమ్మన నారాయణ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు స్వాగతం పలికారు. కోలమూరులో రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో  స్వాగతం పలికారు. కొంతమూరులో మహిళలు మంగళహారతులు పట్టారు.  క్వారీ సెంటర్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో చోడిశెట్టి రాఘవబాబు తదితరులు స్వాగతం పలికారు. అక్కడ  జగన్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోపక్క వేలాది మంది కార్లతో జగన్ కాన్వాయ్‌లో పాల్గొన్నారు. దారిపొడవునా మేళతాళాలు, బాణాసంచా కాల్పులతో స్వాగతం పలుకుతూ హోరెత్తించారు.
 

Advertisement
Advertisement