బాలల బూతుబొమ్మల ‘సెర్చ్’కు చెక్!

19 Nov, 2013 02:45 IST|Sakshi

 లండన్: ఇంటర్‌నెట్‌లో పిల్లలకు సంబంధించిన బూతు బొమ్మలు, వీడియోల కోసం సెర్చ్ చేయడాన్ని అడ్డుకునే సరికొత్త సాంకేతికతను గూగుల్ రూపొందించింది. ఇటువంటి అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోల కోసం గాలించే లక్ష ప్రయత్నాలను అడ్డుకున్నామని గూగుల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎరిక్ ష్మిడ్ట్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీ మెయిల్’ పత్రికలో ఓ వ్యాసం రాస్తూ.. ఆంగ్లంలో వెతికే ప్రయత్నాలను ఈ కొత్త సాంకేతికత  అడ్డుకుంటుందన్నారు.  
 

మరిన్ని వార్తలు