జీఎస్‌టీ:ఆటోఇండస్ట్రీకి మేలు చేస్తుందా?

19 May, 2017 19:22 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్‌టీ  పన్నుల  రేటుపై  ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం  చేశారు.  ఒకవైపు 18శాతం పన్నురేటుపై టెలికాం పరిశ్రమ నిరాశను ప్రకటించగా,  ఆటోఇండస్ట్రీ మాత్రంహర‍్హం వ్యక‍్తం చేసింది.  జీఎస్‌టీ తాజా పన్ను రేట్లు పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని  ఆటో మొబైల్‌ పరిశ్రమ పెద్దలు వ్యాఖ‍్యానించారు.

ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించి జీఎస్‌టీ  రేట్లు  ఊహించిన రీతిలో ఉన్నాయని  సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. పన్నుల విషయంలో స్థిరత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం  కృషి చేసిందన్నారు. దేశంలో ఆటోమోటివ్ మార్కెట్ను  ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే  ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2016-26విజన్‌ సాధనకు  మార్గాన్ని సుగమం  చేస్తుదని  సియామ్‌  అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. పర్యావరణ హితమైన ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీకి ప్రభుత్వం ప్రోత్సాహిన్నిస్తోందన్నారు.  ఇలాంటి వాహనాలపై తక్కువ పన్నురేటువిధానాలు గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గా రాలను,కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయం చేస్తాయన్నారు. అయితే లగ్జరీ వాహనాలపైనా,  ప్రజా రవాణాకుపయోగపడే 10-13 సీటర్‌ వాహనాలపై 15శాతం సెస్‌ ఊహించలేదన్నారు. దీన్ని సమీక్షించాల్సి ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు